జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » 28న ఆస్ట్రేలియా నూతన పార్లమెంట్ సమావేశాలు! (Australia | New parliament | September 28 | Julia Gillard)
Bookmark and Share Feedback Print
 
ఆస్ట్రేలియా నూతన పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 28వ తేదీన ఆరంభం కానున్నాయి. 70 ఏళ్ల తర్వాత మైనారిటీ ప్రభుత్వంతో ఆసీస్ కొత్త ప్రధాన మంత్రి జూలియా గిలార్డ్ నేతృత్వంలో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియాలో ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా లేబర్ పార్టీ అధ్యక్షురాలు జూలియా గిలార్డ్.. మైనారిటీతో కొత్త ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు.

150 స్థానాల్లో లేబర్ పార్టీ 72 స్థానాల్లో గెలుపొందింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా నాలుగు స్థానాలు అవసరమైన తరుణంలో జూలియా గిలార్డ్‌కు నాలుగు పార్లమెంట్ సభ్యులు మద్దతిచ్చేందుకు ముందుకువచ్చారు. దీంతో జూలియా గిలార్డ్ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

కాగా.. 70 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో మైనారిటీ కలిగిన ప్రభుత్వంతో కూడిన పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 28న ఆరంభం కానుండటం విశేషం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.