ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఖురాన్‌ను తగలబెట్టడం అసంగత చర్య: ఐక్యరాజ్య సమితి (Quran burning | Abhorrent Act | UN | United Nations | Afghanistan | Ban Ki moon)
ఖరాన్‌ను దహనం చేయాలని అమెరికా క్రైస్తవ మత బోధకులు తీసుకున్న నిర్ణయం ఓ "అసంగత చర్య" అని ఐక్య రాజ్య సమితి అభిప్రాయపడింది. వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఐరాస ఖండించింది. 9/11 దాడులకు నిరసనగా సమ సంస్థ డవ్ వరల్డ్ ఔట్‌రీచ్ సెంటర్ బహిరంగంగా తగులబెట్టాలన్న వాదనను వ్యతిరేఖిస్తు ఐరాస ఈ వ్యాఖ్యలు చేసింది.
ఐరాస జనరల్ సెక్రటరీ బాన్‌కీ మూన్ కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేఖించారు. ఖరాన్‌ను దగ్ధం చేయడం వల్ల ఆఫ్ఘనిస్థాన్‌లోని తమ సానికులకు ముప్పు వాటిల్లుతుందని ఐరాస అభిప్రాయ పడింది.
మరోవైపు అమెరికా విదేశాంగ శాక మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా క్రైస్తవ మత నాయకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికన్లు దేశం ఆవిర్భవించి నప్పటి నుంచీ ఇప్పటి వరకూ మతసహనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ చర్య అగౌరవనీయమైనదని, అప్రతిష్టాకరమైనదని, దీనిని క్రైస్తవ తమ నాయకులతో పాటు అన్ని మతాలు వారు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆమె తెలిపారు.
ఇదిలా ఉంటే 9/11 దాడులకు నిరసనగా తమ సంస్థ డవ్ వరల్డ్ ఔట్‌రీచ్ సెంటర్ బహిరంగంగా ఖురాన్‌ను కాల్చి తీరుతాం అని పాస్టర్ టెర్రీ జోన్స్ చెప్పారు. అప్పటి దాడుల్లో మృతి చెందిన 3,000 మందిని గుర్తు చేసుకొవడానికి అతివాద ముస్లింలను హెచ్చరించటానికి ఈ చర్యకు పూనుకున్నట్లు ఆయన తెలిపారు.