ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆప్ఘన్‌లో తాలిబన్ల గెలుపుకు సమయం ఆసన్నమవుతోంది! (Afganistan | Talibans | Mulla Omer | America | Army | International)
ఆప్ఘనిస్థాన్‌లో ప్రముఖ ఉగ్రవాద సంస్థ తాలిబన్లు గెలుపొందేందుకు సమయం ఆసన్నమవుతోందని ఆ సంస్థ చీఫ్ ముల్లా ఒమర్ ప్రకటించాడు. ఆప్ఘన్‌లో రాజ్యమేలే తాలిబన్ సంస్థకు విజయం దగ్గర్లోనే ఉందని ముల్లా ఒమర్ అన్నాడు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ ఉగ్రవాద సంస్థకు చెందిన తాలిబన్లను ఉద్దేశించి విడుదల చేసిన ఓ ప్రకటనను తాలిబన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ ప్రచురించింది. ఆ ప్రకటనలో ఒమర్ మాట్లాడుతూ.. ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా సైనిక బలగాలను మట్టికరిపిస్తామన్నాడు.
ఇంకా ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ఖాయమని ముల్లా ఒమర్ ఉద్ఘాటించాడు. ఇంకా అమెరికన్లు తమ ప్రాణాలను, పలు కోట్ల ధనాన్ని ఆప్ఘనిస్థాన్‌లో అనసరంగా వెచ్చిస్తోందని ముల్లా ఒమర్ అన్నాడు. త్వరలో ఆప్ఘన్ నుంచి అమెరికా సైనిక బలగాలు స్వదేశానికి చేరుకుంటాయని ఒమర్ నమ్మకం వ్యక్తం చేశాడు.