జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఔట్‌సోర్సింగ్ ఇచ్చే కంపెనీలకు పన్ను రాయితీలు ఉండవు (No tax incentives | IT Companies | Outsource | Barak Obama | Outsourcings | Jobs)
Bookmark and Share Feedback Print
 
తమదేశంలో నిరుద్యోగ రేటును తగ్గించేందుకు బుధవారం 50 బిలియన్ డాలర్లతో ఓ ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించిని ఒబామా.. అంతటితో తృప్తి చెందినట్లు లేరు. ఇప్పడు తాగా ఔట్‌సోర్సింగ్ అందించే కంపెనీలపై దృష్టి సారించారు. ఔట్‌సోర్సింగ్‌ను నిషేదిస్తున్నట్లు ఓహియో గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఒబామా సమర్ధిస్తున్నారు.

పైపెచ్చు ఇటువంటి ఔట్‌సోర్సింగ్ అందించే స్వదేశీ కంపెనీలకు పన్ను రాయితీలు ఇవ్వబోవమని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలని ఒబామా తెలిపారు. విదేశాలలోని ఉద్యోగాల సృష్టికి దోహదం చేసే పన్నుల విధానంలోని లోపాలను సవరించేందుకు తాను ట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.

స్వదేశంలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఉదార పన్ను రుణాలు (టాక్స్ క్రెడిట్) కల్పిస్తామని ఒబామా అన్నారు. విదేశాలలో కాక స్వదేశంలోని ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు మాత్రమే పన్ను మినహాయింపులు వర్తిస్తాయని మెలిక పెట్టారు. మరో వైపు ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఒబామా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటురున్నారని రిపబ్లికన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రభుత్వ ఐటీ కంపెనీలు భారత్‌తో సహా ఇతర దేశాలకు ఔట్‌సోర్సింగ్‌ను కల్పించ కూడదంటూ అమెరికా ఓహియో గవర్నర్ టెడ్‌ స్ట్రిక్‌ల్యాండ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఔట్‌సోర్సింగ్‌ వల్ల తమ దేశంలో ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.