ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కమ్యూనిస్టు విధానాలతో ప్రయోజనం శూన్యం: క్యాస్ట్రో (Communist policies | Fidel Castro | Raul Castro | Cuba | International)
తాము పాటిస్తున్న కమ్యూనిస్టు విధానాలతో ప్రయోజనం లేదని క్యూబా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ అవిశ్రాంత కమ్యూనిస్టు యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో అభిప్రాయపడ్డారు. 84 సంవత్సరాల ఈ యోధుడు.. యాభై ఏళ్ళ క్రితం విప్లవం లేవదీసి క్యూబాను కమ్యూనిస్టు దేశంగా తీర్చిదిద్దారు.
ఈ నేపథ్యంలో ఆయన అమెరికా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు విధానాలతో లాభం లేదని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో కూడా వీటివల్ల ప్రయోజనం ఉండబోదన్నారు. క్యూబా అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో దేశంలో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
దీనిపై స్వదేశీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఫిడెల్ క్యాస్ట్రో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్థిక సంస్కరణలకు మద్దతు తెలిపేందుకు ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని ప్రతి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.