జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » వాయువ్య పాక్‌లో అమెరికా క్షిపణిదాడులు ముమ్మరం! (Pakistan | America | Terrorist | Drone attacks | Al quead | Afganistan)
Bookmark and Share Feedback Print
 
వాయువ్య పాకిస్థాన్‌లో అమెరికా క్షిపణి దాడులను మరింత ముమ్మరం చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో నాలుగు సార్లు ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆరుగురు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోగా, తీవ్రవాద సంస్థలకు చెందిన పలు శిబిరాలను ధ్వంసం చేసినట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులను స్థావరంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌ఖైదా, దాని అనుబంధ సంస్థలపై గత కొంతకాలంగా అమెరికా దాడులు చేస్తున్న విషయం తెల్సిందే. ఆఫ్ఘన్‌ సరిహద్దులోని ఇళ్ళు, ఒక వాహనంపై ఈ దాడులు జరిగాయని అమెరికా అధికారులు వెల్లడించారు.

ఆ ప్రాంతంపై మానవ రహిత, రిమోట్‌ కంట్రోల్‌ విమానాలుగా భావిస్తున్న డ్రోన్‌లు ముమ్మరంగా దాడులు చేసినట్టు చెప్పారు. అయితే ఈ దాడుల్లో అమెరికా లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదుల కంటే సాధారణ పౌరులే ఎక్కువగా మరణిస్తున్నట్టు స్థానికులు చెపుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.