ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఖురాన్ ప్రతుల దహనాన్ని విరమించుకున్న ఫాస్టర్! (Florida | Pastor | Quran-burning plan | Washington | Obama)
ఫ్లోరిడా చర్చిలో ఖురాన్ ప్రతులను దహనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఒక క్రిస్టియన్ ఫాస్టర్ ఉపసంహరించుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయంగా ఒక్కసారి విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా పలువురు మతపెద్దలు తీవ్రంగా ఖండించారు. పైపెచ్చు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా హెచ్చరించారు. దీంతో ఆ ఫాస్టర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇలాంటి చర్యలు ఆల్‌ఖైదా ఆత్మహత్య దాడులను మరింతగా ప్రేరేపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫాస్టర్ ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ఫ్లోరిడా పట్టణానికి చెందిన మంత్రి, టినీ డోవ్ వరల్డ్ ఔట్‌రిచ్ సెంటర్ అధిపతి టెర్రీ జోన్స్‌తో సమావేశమయ్యారు. ఖురాన్ ప్రతుల దహన చర్య చేపట్టకుండా ఫాస్టర్‌పై ఒత్తిడి చేయాలని ఆయన కోరారు. ఈ ఒత్తిడి ఫలించడంతో ఫాస్టర్ తన చర్యను రద్దు చేసుకున్నారు.