జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అరుణాచల్‌ ప్రదేశ్‌లో మొబైల్ టవర్: చైనా కవ్వింపు చర్య! (China | India | Arunachal pradesh | Mobile tower | International)
Bookmark and Share Feedback Print
 
పొరుగున్న ఉన్న చైనా మరోమారు తన నైజాన్ని బయటపెట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తన సైన్యాన్ని మొహరించి వివాదానికి దారితీసిన చైనా.. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్‌‌ సరిహద్దుల్లో ప్రైవేట్ మొబైల్ కంపెనీలు సెల్ టవర్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా భారత సైనికాధికారులు బీజింగ్‌లో పర్యటించేందుకు చైనా వీసా నిరాకరించింది. ఈ చర్యకు ప్రతిగా భారత్ స్పందించింది. ఆ తర్వాత పీఓకేలో తన సైన్యాన్ని మొహరించింది. దీనిపై భారత్ నిలదీయడంతో చైనా తన బలగాలను ఉపసంహరించింది.

ఇంతలో మరో దుస్సాహసానికి పాల్పడింది. అరుణాచల్ సరిహద్దుపై ఉభయదేశాలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో సెల్‌టవర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ప్రముఖ మొబైల్స్‌లలో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సెల్ టవర్‌ను ఈ రాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించేందుకు చైనాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ బీజింగ్‌ను అనుమతి కోరగా, వెంటనే మంజూరు చేసింది.

ఈ నిర్ణయం రెచ్చగొట్టే ధోరణిని తలపిస్తోందని నిపుణులు ఆరోపిస్తున్నారు. కాగా, దక్షిణాసియా శాంతి సుస్థిరత కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.