జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » తాలిబన్ నేత ముల్లా ఒమర్‌కు కర్జాయ్ చర్చల పిలుపు! (Afghan | President | Taliban leader | Peace talks | Terrorism | Karzai | Kabul)
Bookmark and Share Feedback Print
 
తీవ్రవాదానికి స్వస్తి పలికి శాంతి చర్చలకు ముందుకు రావాలని తాలిబాన్ తీవ్రవాద సంస్థ నేత ముల్లా మొహమ్మద్ ఓమర్‌కు ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ పిలుపునిచ్చారు. కాబూల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి ప్రక్రియలో ముల్లా ఒమర్ పాల్గొంటారని భావిస్తున్నట్టు చెప్పారు.

బాంబు దాడుల్లో అనేక మంది చిన్నారులు, మహిళలు, పురుషులు మృత్యువాత పడుతున్నారని, దీన్ని తక్షణం ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇందుకోసం ఉభయ వర్గాలు చొరవ చూపాల్సివుందన్నారు. అందువల్ల తాలిబన్ నేతలు హింసాకాండకు స్వస్తి చెప్పి శాంతి చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.