ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » లాడెన్ ఆచూకీ పాకిస్థాన్‌కు తెలిసివుండొచ్చు : లియాన్ పనెట్టా (Osama bin Laden | Military Academy | Abbottabad | Washington | Panetta)
అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు దివంగత ఒసామా బిన్ లాడెన్ నివాసం ఉన్నరహస్య స్థావరం గురించి పాకిస్థాన్‌లోని అధికారుల్లో ఏ ఒక్కరికైనా మందుగానే తెలిసివుంటున్న విషయాన్ని తాను భావిస్తున్నట్టు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లియోన్ పనెట్టా శుక్రవారం అన్నారు. ఇదే అంశంపై ఆయన ఒక టీవీ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ఆదివారం ప్రసారం కానుంది.
18 అడుగుల ఎత్తు ప్రహరీ గోడ కలిగిన భవంతిలో ఏదో జరుగుతుందన్న విషయం ఎవరో ఒకరికి తెలిసి ఉంటుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. అయితే, లాడెన్ గురించి పాకిస్థాన్‌కు తెలుసన్న అంశంపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవన్నారు.
అంతేకాకుండా, లాడెన్ భవంతిపై దాడి చేయడానికి పాకిస్థాన్ డాక్టర్ కీలక సమాచారం ఇచ్చినట్టు ఈ రక్షణ శాఖ కార్యదర్శి తొలిసారి చెప్పుకొచ్చారు. గత యేడాది మే నెలలో అబొట్టాబాద్‌లో ఉన్న లాడెన్ నివాసంపై అమెరికా నేవీ విభాగానికి చెందిన సీల్ దళం మెరుపుదాడి చేసి హతమార్చిన విషయం తెల్సిందే.