జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » రాజకీయాలకు స్వస్తి చెప్పనున్న అమెరికా విదేశాంగ మంత్రి క్లింటన్ (Hillary Clinton | America | Politics | Obama)
అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామా విజయం సాధించినప్పటికీ, తాను రాజకీయాల్లో కొనసాగేందుకు సుముఖంగా లేదని హిల్లరీ క్లింటన్ వెల్లడించారు. హిల్లరీ క్లింటన్ ఈ విషయాన్ని తన మంత్రివర్గంలోని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటికీ, రెండోసారి విదేశాంగ మంత్రి పదవిలో కొనసాగేందుకు ఇష్టం లేదని హిల్లరీ వెల్లడించారు. విదేశాంగ మంత్రిగా తన స్థానంలో ఒబామా వేరొక మంత్రి నియమించేంతవరకు ఈ పదవిలో కొనసాగుతానని క్లింటన్ తెలిపారు.

20 ఏళ్ల సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నందున, రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు హిల్లరీ చెప్పారు. ఇంకా తనకు విశ్రాంతి కావాలని కోరుకుంటున్నట్లు క్లింటన్ అన్నారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia