జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆస్ట్రేలియాలో బయటపడిన అతిపెద్ద ఎరుపు వర్ణపు వజ్రం! (Australia | Diamond | Argayil Mine | World)
ఆస్ట్రేలియాలోని ఆర్గయిల్ గనిలో బయటపడిన అరుదైన లేత ఎరుపు వర్ణపు అతి పెద్ద వజ్రం ఒకటి బయటపడింది. దీని బరువు 12.76 క్యారెట్లు. ఈ వజ్రాన్ని ఆస్ట్రేలియాలోని తూర్పు కింబర్లీ ప్రాంతంలో గల ఒక వజ్రాల గనిలో కనుగొన్నారు. దీని విలువ కొన్ని మిలియన్ల డాలర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వజ్రం బయటపడిన గని ప్రాంతం పేరు కలిసివచ్చేలా దీనికి ఆర్గయిల్ పింక్ జూబిలీ అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఇది పెర్త్‌లో సానబెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించిన తర్వాత ఈ యేడాది చివర్లో అమ్మకానికి పెట్టనున్నట్లు సమాచారం.

లేత ఎరుపు వర్ణ వజ్రాల పుట్టగా పేరుగాంచిన ఆర్గయిల్ గనిని లేత ఎరుపు వర్ణపు వజ్రాల పుట్ట అనడంలో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రపంచంలో గల లేత ఎరుపు వర్ణాల వజ్రాల్లో 90 శాతం ఈ గని నుండి బయటపడినవే. అయితే, ప్రస్తుతం బయటపడిన ఈ వజ్రం మాత్రం వాటన్నింటి కంటే పెద్దదని వజ్రాల నిపుణులు చెపుతున్నారు. కాగా విలువలో కూడా దీనికి సాటే లేదు. బహుశా ఇకపై ఇలాంటి వజ్రాన్ని కనుగొంటామో లేదో కూడా తెలియదని వారంటున్నారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia