ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆఫ్రికాలో లోయలో బోల్తా పడిన లారీ : 50 మంది మృతి (Africa | Lorry Acctident | Road | International)
ఆఫ్రికాలో లోయలో బోల్తా పడిన లారీ : 50 మంది మృతి
ఆదివారం, 4 మార్చి 2012( 12:02 IST )
ఆఫ్రికా దేశం గునియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో సుమారు 50 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.
మోరిబాడ్యు నుంచి బైలా పట్టణంలో జరుగుతున్న వారాంతపు సంతకు పెద్ద సంఖ్యలో ప్రజలను తీసుకెళ్తున్న లారీ బ్రేకులు పనిచేయకపోవడంతో లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడినట్టు వారు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బైలా ఆస్పత్రికి తరలించారు.