ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అధ్యక్షుడు రాజకీయాల్లో తలదూర్చరాదు : లాహోర్ కోర్టు (Pakistan | Lahore Court | Politics | Zardari | ppp)
అధ్యక్షుడు రాజకీయాల్లో తలదూర్చరాదు : లాహోర్ కోర్టు
శనివారం, 30 జూన్ 2012( 09:25 IST )
File
FILE
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి లాహోర్ కోర్టు షాక్ ఇచ్చింది. దేశాధ్యక్షుడిగా ఉన్న ఆయన జర్దారీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) రాజకీయాల్లో తలదూర్చరాదని లాహోర్ కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.
పదవిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించకుండా కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని జర్దారీని ఆదేశించింది. రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం గానీ అధ్యక్ష పదవిని సొంత పార్టీ ప్రయోజనాలకు వాడడం గానీ చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అధ్యక్షుడు తమ ఆదేశాలను పాటించని పక్షంలో కోర్టు ధిక్కారణగా పరిగణించాల్సి వస్తుందని ముగ్గురు జడ్జిలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం హెచ్చరించింది.
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా జర్దారీ నడచుకోవాలని లేకుంటే ధిక్కారణ కింద పరిగణించాల్సి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అట బండియల్ హెచ్చరించారు. జర్దారీ రాజకీయ జోక్యంపై దాఖలైన పిటిషన్లను విచారించాం. దీనిపై స్వల్పకాలిక ఆదేశం ఇస్తున్నాం. లాహోర్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో కఠినంగా వ్యవహించాల్సి వస్తుందని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు.