జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలుగుతేజాల దుర్మరణం (Five Indian Techies From Andhra Pradesh die in us car Crash)
FILE
శుక్రవారం అమెరికాలోని ఒక్లహోమా నగరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఒక్లహోమా హైవే పోలీసుల ప్రతినిధి క్రిస్ వెస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఐ-235 రహదారిపై దక్షిణం వైపు వెళుతున్న షెవర్లే కారు, డల్లాస్ జంక్షన్ మలుపువద్ద డ్రైవర్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో పక్క రోడ్డు మీదికి వేగంగా దూసుకొచ్చి ఓ ట్రాక్టర్ ట్రయిలర్ ట్రక్కు వెనుక భాగంలో ఢీకొంది.

కారు పైకప్పు లేచిపోగా కారు అగ్నిగోళంలా దొర్లుకుంటూ దగ్ధమైందని పోలీసులు వెల్లడించారు. మృతులు జశ్వంత్ రెడ్డి, గాదె ఫణీంద్ర, అంతాటి అనురాగ్, రావికంటి శ్రీనివాస్, వెంకట్‌గా గుర్తించగా, ఫణీంద్ర ఖమ్మం జిల్లా వాసిగా, రావికంటి శ్రీనివాస్‌ది‌ కరీంనగర్ జిల్లాగా, జశ్వంత్ రెడ్డిది కడపగా, అనురాగ్, వెంకట్‌లది హైదరాబాద్‌కు చెందినవారని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తెలిపింది. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ‘తానా’ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు.
సంబంధిత సమాచారం
Feedback Print