జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఇందిరా గాంధీకి క్షమాపణ చెప్పిన వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్! (Neil Armstrong Apologised to Indira Gandhi)
indira gandhi
File
FILE
చంద్రమండలంపై కాలుమోపిన తొలి మానవునిగా చరిత్ర సృష్టించిన అమెరికా అంతరిక్ష వ్యోమగామి నీల్ ఆల్డెన్ ఆర్మ్‌స్ట్రాంగ్ భారత దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి స్వయంగా క్షమాపణ చెప్పారు. ఈనెల 25వ తేదీన తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఈయన.. గుర్తులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చంద్రునిపై అడుగుపెట్టి మానవుడి సంకల్పానికి ఉన్న శక్తి ఎంతో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన కె.నట్వర్ సింగ్.. ఆర్మ్ స్ట్రాంగ్ భారత పర్యటన వివరాలను వెల్లడించారు.

తొలిసారిగా 1969 సంవత్సరం జూలై 20 నీల్ అంతరిక్ష ప్రయాణంలో భాగంగా చంద్రునిపై కాలు మోపే దృశ్యాలను వీక్షించాలని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తెల్లవారుజామున 4.30గంటల వరకు నిద్ర మేలుకున్నారట. అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రపంచ పర్యటనలో భాగంగా భారత్ విచ్చేసిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ప్రధాన మంత్రిని కలువడానికి పార్లమెంట్‌కు విచ్చేయగా ఇందిరా గాంధీతో పాటుగా కేంద్ర పెద్దలు నీల్‌కు సాదర స్వాగతం పలికారని చెప్పారు.

అలా ఆ సమయంలో నట్వర్ సింగ్‌కు మాట్లాడే అవకాశాన్ని ఇందిరా కల్పించారు. దీంతో నీల్‌తో సింగ్ మాట్లాడుతూ.. "మీరు చంద్రునిపై అడుగు పెట్టే అపురూపమైన దృశ్యాలను వీక్షించాలన్న ఆకాంక్షతో ప్రధానమంత్రి ఇందిరా గాంధి తెల్లవారుజామున 4.౩౦ గంటల వరకు మేల్కొన్నారని నట్వర్ చెప్పారట.

దీంతో వెంటనే కలుగజేసుకున్న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ తక్షణం క్షమాపణ చెప్పి మరో మారు ఇలా మిమ్మల్ని ఎదురు చూడనివ్వకుండా భారత కాలమానం ప్రకారమే తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తానని వినమ్రయంగా చెప్పారని నట్వర్ సింగ్ తాజాగా వెల్లడించారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతితో కలత చెందిన మాజీ మంత్రి కే.నట్వర్ సింగ్ తన మనస్సులోని మాటను వెల్లడించారు.
సంబంధిత సమాచారం
Feedback Print