| FILEనీచ రాజకీయాలు |
| ఇంకా చదవండి |
| 2014 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనం తనకు పట్టంకడతారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పగటి కలలు కుంటున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటాడని, తన తండ్రి, మహానేత వైఎస్ఆర్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని వాపక్ష కార్యకర్తలు కోరితే వారిపై కాల్పులు జరిపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా, రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నాంటూ అవహేళనగా మాట్లాడిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. | అధికార కాంగ్రెస్ పార్టీపై వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. తమ రాజీనామాలను ఆమోదించుకునే విషయంలో తాము వెనుకడుగు వేసినట్టు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై వారు మండిపడ్డారు. కాకమ్మ కబుర్లు మాని దమ్ముంటే తమ రాజీనామాలపై ఆమోదముద్ర వేయాలని వారు పిలుపునిచ్చారు. తమ రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గురునాథ్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ప్రకటించారు. అలాగే, తమ రాజీనామాలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని మరో ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. |