ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఫ్రాన్సిస్కో ఎన్నిక
గోవా శాసనసభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శాసనసభాపక్ష నేతగా ఫ్రాన్సిస్కో పాచికో ఎన్నికయ్యారు. ఫ్రాన్సిస్కో బెనోలియం స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఎన్పీపీకి శాసనసభలో మొత్తం మూడు స్థానాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ పార్టీకి అధ్యక్షుడుగా విల్ఫెడ్ర్ డిసౌజా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత పాచికో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే తమ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన సంగతిని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యో అభ్యర్ధి విషయంలో తమ పార్టీ జోక్యం చేసుకోదన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఉపముఖ్యమంత్రి పదవి కేటాయిస్తుందని భావిస్తున్నామన్నారు.

సంకీర్ణ ప్రభుత్వం తీరుతెన్నుల గురించి ఆ పార్టీతో చర్చించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ది ఎంపిక కోసం ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి మార్గరేట్ ఆల్వా, కార్యదర్శి సిద్దార్ధ్ పటేల్‌లు పనాజీకి బుధవారం చేరుకున్నారు.
మరిన్ని
టైగర్ మేనన్ బాడీగార్డుకు జీవిత ఖైదు
పూర్తి నివేదికను సుప్రీంకు సమర్పిస్తాం: గిల్
పర్యావరణ సమస్యలపై ప్రధాన దృష్టి: ప్రధాని
నేడు శంకర రామన్ హత్య కేసు విచారణ
న్యూఢిల్లీలో ఆరోగ్య మంత్రుల సదస్సు
తాజ్‌ కారిడార్ కేసులో మాయావతికి ఊరట