ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
రాజకీయాల నుంచి ఇపుడే వైదొలగను: దేవెగౌడ
క్రియాశీలక రాజకీయాల నుంచి ఇప్పుడే వైదలగే ప్రసక్తే లేదని మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కర్నాటకలో భాజపా-జనతాదళ్ (ఎస్) పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మరో నాలుగున్నర నెలల తర్వాత అధికారాన్ని భాజపాకు బదిలీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేవెగౌడ వ్యాఖ్యలతో ఇంతకాలం కొనసాగుతున్న అధికార బదిలీ ఊహాగానాలపై తెరపడింది.

ప్రస్తుతం కర్నాటకలో తన కుమారుడు కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెల్సిందే. భాజపా-జనతాదళ్ (ఎస్) ఒప్పందం మేరకు మరో నాలుగు నెలలో కుమారస్వామి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో 'ఎస్' నేతలు కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. వీటికి దేవెగౌడ ఆదివారం బెంగుళూరులో తెరదించారు.
మరిన్ని
కాంగ్రెస్‌కు నరేంద్ర మోడీ హితవు
భానుడి ప్రతాపంతో మండుతున్న ఉత్తర భారతం
అధికారం నన్నెప్పుడూ ఆకర్షించలేదు: సోనియా
మీ సమస్యలు మాపై రుద్దకండి: ప్రణబ్
ఐఐఎఫ్ఏ ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్
రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కావాలి: ప్రధాని