ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
అస్సాంలో భారీ వర్షాలు : ప్రజల తరలింపు
ఋతుపవనాల కారణంగా అస్సాంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నదులన్నీ నీటితో నిండిపోవడంతో వందలాది ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర రెవిన్యూ, నివారణ, పునరావాసం శాఖల మంత్రి భూమిందర్ బర్మన్ పేర్కొన్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు గ్రామాలకు చెందిన సుమారు 1,50,00 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బర్మన్ వివరించారు.

అంతేకాకుండా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకై సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సుమారు 125 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయని, ఆయా గ్రామాలకు చెందిన పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బర్మన్ చెప్పారు.
మరిన్ని
పీపీఎంబీ ఏర్పాటు చేస్తాం: ప్రధాని
జయలలిత ఢిల్లీ ప్రయాణం రద్దు
కలాంకు మద్దతు ఇవ్వం: బాల్‌థాకరే
కలాంకే తొలి ప్రాధాన్యత: మమత
పోటీకి కలాం అంగీకరిస్తే మద్దతు: భాజపా
ఆస్తుల ధ్వంసంపై సుప్రీం అంసతృప్తి