రెండో దఫా రాష్ట్రపతి పదవి చేపట్టేందుకు వీలుగా అబ్దుల్ కలాం అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయానికి రావాలన్న తృతీయ ఫ్రంట్ ప్రతిపాదనను ఆర్జెడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరస్కరించారు. రాష్ట్రపతి పదవి నుంచి కలాం గౌరవప్రదంగా తప్పుకోవాలని ఆయన అన్నారు.
పునరాలోచన లేకుండా కలాం హుందాగా తప్పుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేత ప్రియరంజన్ దాస్ మ్షుని సమక్షంలో యుపిఎ-లెఫ్ట్ కూటమి రాష్ర్టపతి అభ్యర్థి ప్రతిభా పాటిల్ నామినేషన్ పత్రాలపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి గురువారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా లాలూ మ్లాటాడుతూ యుపిఎ-లెఫ్ట్ కూటమి అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.
తృతీయ ఫ్రంట్ రాష్ర్టపతి అభ్యర్థిగా కలాంను ప్రతిపాదించడంపై వ్యాఖ్యానిస్తూ... ఎన్డీఏ ఆధ్యక్షుడు, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి కలాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని లాలూ అన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రపతిగా మహిళ ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
|