కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో ముంబై మాజీ పోలీసు కమిషనర్ ఆర్.ఎస్.శర్మాతో పాటు.. మరో ఇద్దరు పోలీసు అధికారులను పూణే ప్రత్యేక కోర్టు బుధవారం విడుదల చేసింది. వారిపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు న్యాయమూర్తి కే.బేడి పేర్కొన్నారు.
విడుదలైన వారిలో శర్మాతో పాటు డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ సావంత్, సస్పెండ్‌కు గురైన వశిష్ట అంథోలేలను కూడా ఈ కేసు విచారణ నుంచి విముక్తులను చేసింది. ఇదే కేసులో స్టాంప్ వెండర్ యాదవ్ ముట్టాను మంగళవారం ప్రత్యేక కోర్టు విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈయన తెల్కీ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పని చేసిన విషయం తెల్సిందే.
|