గత కొద్దిరోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో గల జస్వంత్ సాగర్ డ్యామ్ కూలిపోయింది. దీంతో సమీపంలోని నలభై గ్రామాలు ప్రమాదపుటంచున ఉన్నాయి.
118 సంవత్సరాల వయస్సున్న ఈ డ్యామ్ ఇటీవలి వర్షాలకు బీటలు వారింది. జోద్‌పూర్, పాలి జిల్లాలు వరద తాకిడికి గురి కావడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. సైన్యం రంగ ప్రవేశం చేసి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోడ్డు సంబంధాలు తెగిపోయాయి.
దీంతో జోద్‌పూర్, జైపూర్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి నలభై గ్రామాలు ప్రజలు వరద తాకిడికి గురయ్యారు. ఈ ప్రాంత పరిథిలోని బర్మర్ జిల్లాలో 2006లో సంభవించిన వరదలకు దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
|