యూపీఏ-లెఫ్ట్ పార్టీల ప్రతిపాదిత రాష్ట్రపతి అభ్యర్థి ప్రతిభాపాటిల్‌పై ఇటీవల వెల్లువెత్తిన ఆరోపణలను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల సమాఖ్య తోసిపుచ్చింది.
ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి ఇటీవల ఆమెపై నమోదైన అభియోగాలు పూర్తిగా నిరాధారాలని పేర్కొంది. రాజకీయ పరంగా కుట్రలో భాగమే ఈ ఆరోపణలని తెలిపింది.
ముంబయిలో జరిగిన విలేకరుల సమావేశంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల సమాఖ్య అధ్యక్షుడు, చైర్మెన్ వోరా పాల్గొని ప్రతిభా పాటిల్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు.
|