బోరుబావిలో పడిపోయిన రాజస్థాన్ బాలుడు సూరజ్ బంజారా శుక్రవారం రాత్రి మృతి చెందాడు. బోరుబావి నుంచి వెలికి తీయడానికి దాదాపు 50 గంటలు తీవ్రంగా ప్రయత్నించి చివరికి వెలికి తీసినా ఫలితం లేకపోయింది.
అందరినీ ఉత్కంఠకు గురి చేసిన ఈ సంఘటన చివరకు విషాదాంతమైంది. బాలుడు బోరు బావిలో పడిపోయాడన్న విషయం తెలుసుకుని స్పందించిన సైనిక, పౌర విభాగానికి చెందిన సిబ్బంది బాలుడిని వెలికి తీయడానికి తీవ్రంగా కృషి చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయక వెలికి తీసే ప్రయత్నాలు చేశారు.
వెలికి తీసిన అనంతరం వైద్యులు సూరజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజస్థాన్‌లోని నిమేడా గ్రామంలో రోజువారీ కార్మికుడి కుమారుడైన సూరజ్ బుధవారం మధ్యాహ్నం ఆడుకుంటూండగా సమీపంలోని బోరుబావిలోకి జారి పడిన విషయం తెలిసిందే.
|