భారతదేశమాజీ ప్రధాని చంద్రశేఖర్ ఆదివారం ఉదయం మృతి చెందారు. 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రశేఖర్ గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గత మూడు నెలలుగా ఆయన ఇంద్రప్రస్తలోని అపోలో హాస్పిటల్స్ లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
యూపీలోని ఇబ్రహీంపట్టిలో జన్మించిన ఆయన అక్కడే యూనివర్శిటీ ఆఫ్ అలహాబాద్‌లో విద్యనభ్యసించారు. 1995లో ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా పొందారు. ఆయన మృతికి ప్రధాని మన్మోహన్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
|