ప్రపంచ వింతల్లో తాజ్ మహల్ స్థానం సాధించిందని తెలియగానే ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శనకు వచ్చినవారు హర్షాన్ని వ్యక్తం చేశారు. విదేశీయులు సైతం తాజ్ మహల్ కొత్తగా ఏడు వింతల్లో స్థానం సంపాదించటంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు నాటి షాజహాన్‌ను జ్ఞప్తికి తెచ్చే విధంగా ఆ వేషాధారణలో తాజ్ మహల్ సమీపాన ఒకరికొకరు తమ అభినందనలు తెలియజేసుకోవటం అందరినీ ఆకట్టుకుంది.
|