తృణమూల్ కాంగ్రెస్ ఛీఫ్ మమతా బెనర్జీ చెన్నైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలితతో భేటీ అయ్యారు. ఆమె సోమవారం ఉదయం చెన్నై పోయస్ గార్డెన్‌లో ఉన్న జయలలిత నివాసంలో సమావేశమైయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో అబ్ధుల్ కలాం పేరును ప్రతిపాదించిన మూడో ఫ్రంట్‌తో మమత కూడా గొంతు కలిపినందున ఈ భేటీ ముఖ్యాంశంగా నిలిచింది.
ఈ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన మమత తాము నందిగ్రామ్ సంఘటనలపై ప్రచారం చేసేందుకు జరుపుతున్న దేశవ్యాప్త పర్యటన విషయమై జయతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నందిగ్రామ్ మృతులకు సంతాపసూచకంగా జులై 21వ తేదీన తాము నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా జయలలితను కోరామని ఆమె వివరించారు.
|