ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
ఢిల్లీలో బస్సు ప్రమాదం: ఒకరు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఢిల్లీలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకొంది. కార్కాదూమాలో ఉన్న కేంద్రీయ విద్యాలయకు చెందిన బస్సు తూర్పు ఢిల్లీలోని ప్రీతీవిహార్ ప్రాంతంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో సులేమాన్ (50) అనే గార్డియన్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.


ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు గాయపడగా, 18 మంది విద్యార్థుల పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ మిగిలిన ఆరుగురు విద్యార్థులు ఢిల్లీలోని మూడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు బోల్తా పడిన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని
గుజరాత్‌లో వరద ముప్పు : 80 గ్రామాల అప్రమత్తం
కలాం ప్రారంభించిన జాతీయ ఇ-కోర్టుల పథకం
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
జూలై 16 నుంచి ప్రధాని ఆరు రాష్ట్రాల పర్యటన
జయతో తృణమూల్ కాంగ్రెస్ ఛీఫ్ మమతా బెనర్జీ భేటీ
ముంతాజ్... నీ జ్ఞాపకం, నేడు ఓ అద్భుతం!