మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ మృతితో ఖాళీ ఏర్పడిన ఉత్తరప్రదేశ్‌లోని బలియా లోక్‌సభ స్థానంతో పాటు.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ ఎంపీ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆగస్టు 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
జంషెడ్‌పూర్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న జేఎంఎం నేత సునీల్ కుమార్ మహతో హత్యతో ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అందించిన సమాచారం మేరకు.. నోటిఫికేషన్ ఆగస్టు మూడో తేదీన విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ ఆగస్టు పదో తేది. ఆగస్టు 11వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ ఆగస్టు 13. ఆగస్టు 29వ తేదీన జరిగే పోలింగ్ ఓట్లను 31వ తేదీన లెక్కిస్తారు.
|