ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
'మున్నాభాయ్‌'కు శిక్ష సమంజసమే: సోలీ సొరాబ్జీ
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ప్రత్యేక టాడా కోర్టు విధించిన శిక్షను ప్రఖ్యాత న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ ఆదివారం సమర్థించారు. తమ హోదా, ప్రముఖ నాయకులు మద్దతు ద్వారా న్యాయవ్యవస్థను ఎవరూ ప్రభావితం చేయలేరని ఈ తీర్పు హెచ్చరించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంజయ్‌కు ఐదేళ్ల కన్నా తక్కువ శిక్ష పడి ఉంటే.. అధికార ప్రభావం ఉండివుండవచ్చని భావించేవాళ్ళమని, అయితే.. ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా న్యాయం దేనికీ తలవంచదని నిరూపితమైందని ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సోరాబ్జీ అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ఈ తీర్పు సమంజసాన్ని ప్రశ్నించడాన్ని సొరాబ్జీ తప్పుబట్టారు. సంజయ్‌ వద్ద ఉన్నవి బొమ్మ తుపాకీలు, గాలితుపాకీలు కాదని, అత్యంత ప్రమాదకర ఆయుధాలు కలిగి ఉన్న సంజయ్‌కు సరైన శిక్ష విధించారని ఆయన అన్నారు.
మరిన్ని
విచ్ఛిన్నమైన తృతీయ కూటమి: ఏచూరీ
బీహార్‌ వరదలు: జన జీవనం అస్తవ్యస్తం
ఉత్తర భారతంలో భారీ వర్షాలు: 224 మంది మృత్యువాత
కేంద్రానికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం
ఎన్డీయేతో మాకు సమస్యలు లేవు: ఉద్ధవ్
పులుల సంరక్షణకు చర్యలు చేపట్టండి: ప్రధాని