ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
దత్ బెయిల్ పిటీషన్‌: సీబీఐకు నోటీసు జారీ
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిలు పటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిపి, సీబీఐకు నోటీసు జారీ చేసింది. బెయిలుపై పిటీషన్ విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. వచ్చే ఆగస్టు 20వ తేదీన ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి కేజి.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

అంతకుముందు సంజయ్‌దత్ తరపు న్యాయవాది ఫాలీ ఎస్.నారిమాన్ వాదిస్తూ.. దత్ పిటీషన్‌ వ్యవహారాన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరగా, ప్రధమ ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఇదే కేసులో శిక్ష పడిన మరికొంత మంది ముద్దాయిలు కూడా బెయిల్ కోరుతూ పిటీషన్‌లు దాఖలు చేశారు.
మరిన్ని
అణు ఒప్పందంపై ఓటింగ్ జరిగితే వాకౌట్ చేస్తాం: జ్యోతిబసు
చంద్రశేఖర్‌కు నివాళులు: సభ వాయిదా
సంజయ్‌దత్ బెయిల్ పిటీషన్‌పై నేడు సుప్రీం విచారణ
వరద సహాయ పనులకు రూ.4,200 కోట్లు: మున్షీ
ఇన్సాట్-4జి ప్రయోగ కాంట్రాక్టు ఏరియన్ స్పేస్‌కే
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్