ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
వామపక్షాల వైఖరి కంటి తుడుపులాంటిది: ములాయం
భారత్-అమెరికా దేశాలు కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందంపై వామపక్షాలు అవలంబిస్తున్న వైఖరి కేవలం కంటి తుడుపు లాంటిదని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ దుయ్యబట్టారు. లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవలం తం అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వరకే వామపక్షాలకు తెలుసునన్నారు.

ప్రభుత్వాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్న వామపక్షాలు ఎలా ప్రతిపక్ష పాత్ర పోషించగలవని ప్రశ్నించారు. తమ పార్టీ ఈ ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపిన ములాయం ఈ విషయంలో తృతీయ కూటమి నేతలైన చంద్రబాబు, జయలలితతో సహా ఇతర నేతలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. దీనిపై వచ్చే నెల ఢిల్లీలో తమ కూటమి తరపున భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు ములాయం సింగ్ ప్రకటించారు.
మరిన్ని
అణు ఒప్పందంపై వామపక్షాల ద్వంద వైఖరి: వెంకయ్య
ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ప్రమాణం
మద్దతు ఉపసంహరించుకోవచ్చు: ప్రధాని మన్మోహన్‌
123 ఒప్పందంపై పార్లమెంటులో చర్చ
హమీద్ అన్సారీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
ఉల్ఫా తీవ్రవాదుల పంజా: 11 మంది బీహారీలు మృతి