భారత్-అమెరికా అణు ఒప్పందంపై ప్రధాని మన్మోహన్ సింగ్, సీపీఐ నేత ప్రకాష్ కారత్ పట్టువిడుపుల ధోరణి అవలంభించాలని నిర్ణయించారు. మంగళవారం ప్రధానితో సమావేశమైన ప్రకాష్ కారత్ అణు ఒప్పందంపై చర్చించారు. అయితే వీరమధ్య జరిగిన చర్చల సారాంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒప్పందంపై ఇరు పార్టీల మధ్య నెలకొన్న సమస్యలను వ్యూహాత్మకంగా పరిష్కరించుకోవాలని ప్రధాని, కారత్‌లు నిర్ణయించుకున్నట్టు ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు వెల్లడించారు.
ముఖ్యంగా ఈ వారాంతంలో సమావేశమయ్యే సీపీఎం పోలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కారత్ సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే సీపీఎం మహిళా నేత బృందా కారత్ మాత్రం.. అణు ఒప్పందంలో తమ వైఖరి మార్పులేదని స్పష్టం చేశారు.
|