ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
ఐఏఈఏ సమావేశానికి హాజరవుతాం: కాంగ్రెస్
వచ్చే సెప్టెంబరులో జరిగే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ఇండో-యూఎస్ ఒప్పందంపై లెఫ్ట్ పార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను సమావేశానికి ముందుగానే పరిష్కరించేందుకు కృషి చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు.

యూపీఏలోని మిత్రపక్షాలన్నీ కాంగ్రెస్‌కు బాసటగా నిలిచాయని, అందువల్ల దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐఏఈఏ సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు వెల్లడించారు. అదేసమయంలో.. అణు ఒప్పందంపైవచ్చే సూచనలను, సలహాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అమెరికా ఆమోదించిన హైడ్‌ చట్టంలోని షరతులన్నింటికీ భారత్‌ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, దేశ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లనంత కాలమే ఈ ఒప్పందం అమలువుతుందని సింఘ్వీ గుర్తు చేశారు.
మరిన్ని
నేడు సీపీఎం కేంద్ర కమిటీ కీలక సమావేశం
అందని పత్రాలు: జైల్లోనే మున్నాభాయ్
రొనన్ సేన్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఉభయసభలు
యూపీఏ సర్కారు పూర్తికాలం ఉండదు: అద్వానీ
ఎన్డీయే డిమాండ్‌ను తోసిపుచ్చిన కేంద్రం
కేంద్రంలో మధ్యంతర సమస్యే లేదు: జ్యోతిబసు