ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
వ్యక్తిగత కార్యదర్శి హత్య కేసు నుంచి శిబుసొరేన్‌కు విముక్తి
వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసు నుంచి కేంద్ర మంత్రి శిబుసొరేన్ నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే.. ఈ కేసులో మరో నలుగురిని కూడా విడుదల చేసింది. గతంలో సోరేన్‌ను దోషిగా పరిగణించేందుకు కింది కోర్టు తీసుకున్న సాక్ష్యాధారాలను హైకోర్టు కొట్టివేసింది. కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేక పోయిందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే ఢిల్లీ కోర్టు తీర్పును సుప్రీం కోర్టులో అప్పీలు చేయనున్నట్టు శశినాథ్ ఝా కుటుంబ సభ్యులు ప్రకటించారు.

అలాగే.. హతుని భార్య ప్రియంవధా ఝా యాభై లక్షల నష్టంపరిహారం కోరుతూ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కూడా హైకోర్టు కొట్టి వేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా ఉన్న శిబు సోరేన్ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా 1994 కనిపించకుండా పోగా... ఈకేసులో 1999లో శిబు సోరేన్‌ను కోర్టులో లొంగిపోయారు.

ఈ కేసును విచారించిన కిందిస్థాయి కోర్టు గత ఏడాది నవంబరులో దోషిగా ప్రకటించగా.. ప్రస్తుతం జార్ఖండ్‌లోని ఢంకా జైలులో జీవితం గడుపుతున్నారు. ఝా మాయమైన వ్యవహారంపై 1994లో ఎఫ్‌ఐఆర్ నమోదుకాగా.. 1996లో కేసు విచారణను సీబీఐకు అప్పగించారు.
మరిన్ని
ఐఏఈఏ సమావేశానికి భారత్ హాజరుకావచ్చు: ఏచూరీ
ఐఏఈఏ సమావేశానికి హాజరవుతాం: కాంగ్రెస్
నేడు సీపీఎం కేంద్ర కమిటీ కీలక సమావేశం
అందని పత్రాలు: జైల్లోనే మున్నాభాయ్
రొనన్ సేన్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఉభయసభలు
యూపీఏ సర్కారు పూర్తికాలం ఉండదు: అద్వానీ