యూపీఏ సర్కారు సుస్థిరతకు ఎటువంటి భంగం వాటిల్లదని కేంద్ర రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. యూపీఏ ప్రభుత్వం సుస్థిరంగానే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో అర్జేడి అధ్యక్ష్య పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన లాలూ...
అర్జేడికి జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని లాలూ ఈ సందర్భంగా వెల్లడించారు. అర్జేడికి వచ్చే ఏడాది జాతీయపార్టీగా గుర్తింపు తెచ్చే అవకాశముందని లాలూ ప్రసాద్ తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తమ పార్టీకి కీలకమని లాలూ ఆశాభావం వ్యక్తం చేశారు.
|