ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఎట్టకేలకు విడుదలయ్యారు. 1993లో జరిగిన ముంబయి వరుస బాంబు పేలుడు కేసులో ఆయనకు టాడా ప్రత్యేక న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే టాడా న్యాయస్థానం తనకు తీర్పు ప్రతిని ఇవ్వలేదని సంజయ్‌దత్‌తో పాటు శిక్షణను అనుభవిస్తున్న మరికొందరు సుప్రీం కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారణ చేసిన న్యాయస్థానం వారికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే టాడా న్యాయస్థానం తుది తీర్పు ప్రతినిచ్చిన వెంటనే లొంగిపోయి తిరిగి బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా గురువారం ఎరవాడ జైలు నుంచి సంజయ్‌దత్ విడుదల కాగానే జైలుకు వెలుపల ఆయనకు బంధువులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
|