దక్షిణాఫ్రికా పర్యటన నిమిత్తం బయలుదేరిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ గురువారం ఢిల్లీకి పయనం కానున్నారు. స్వదేశంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోనియా తన పర్యటనను మూడు రోజులకు కుదించుకున్నట్లు భారత విదేశాంగ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డర్బన్‌లో పాల్గొనాల్సిన పలు కార్యక్రమాలను సోనియా రద్దు చేసుకున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పర్యటన పవిత్రయాత్ర వంటిదని సోనియా చెప్పారు.
మండేలాను కలువకుండా వెనుదిరిగితే ఆ యాత్ర అసంపూర్తిగా ముగిసినట్లేనని సోనియా అన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీపై రచించిన "గాంధేయమార్గం" పుస్తకాన్ని మండేలాకు అందజేశారు. మంగళవారం విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ శర్మతో సోనియాగాంధీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే.
|