ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
మద్దతు ఉపసంహరించుకుంటాం: సీపీఎం హెచ్చరిక
అమెరికాతో అణు ఒప్పందం అమలుకు ఉపక్రమించిన పక్షంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని సీపీఎం పార్టీ ప్రకటించింది. రెండు రోజులపాటు న్యూఢిల్లీలో జరిగిన సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు గురువారం ముగిసిన అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ మీడియాతో పై విధంగా పేర్కొన్నారు.

అణు ఒప్పందం అమలు పట్ల వామపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒప్పందం కార్యాచరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకాష్ కారత్ స్పష్టం చేసారు. అదే సమయంలో హైడ్ చట్టం అమలు విధివిధానాలను కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

సీపీఎం పొలిట్‌బ్యూరో తీర్మానానికి కేంద్రకమిటీ ఆమోదం తెలిపిందని ప్రకాష్ కారత్ తెలిపారు. అణు ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
మరిన్ని
హెలికాఫ్టర్ ద్వారా ఆహార సరఫరా నిలిపివేత
చెత్తను సేకరించేవారికి అండగా భారతీయ రైల్వే
గురువారం ఢిల్లీకి సోనియా తిరుగుపయనం
ఎరవాడ జైలు నుంచి సంజయ్‌దత్ విడుదల
యూపీఏ సుస్థిరతకు భంగం వాటిల్లదు: లాలూ
వ్యక్తిగత కార్యదర్శి హత్య కేసు నుంచి శిబుసొరేన్‌కు విముక్తి