ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ పిటీషన్ కొట్టివేత
ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ చేసుకున్న అప్పీల్‌ను జోథ్‌పూర్ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో సల్మాన్‌ఖాన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. కోర్టు తీర్పును అనుసరించి సోమవారం నాడు సల్మాన్‌ఖాన్ పోలీసులకు లొంగిపోవాల్సి ఉంటుంది.

తీర్పును వెలువరించిన అనంతరం సల్మాన్‌ఖాన్ హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చునని న్యాయస్థానం పేర్కొంది. 1998వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ఘోడా ఫారమ్‌కు సమీపంలోని ఉజియాలా భక్థార్ వద్ద రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్ ముద్దాయిగా నిరూపితమైన సంగతి తెలిసిందే.

దీంతో ఛీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బ్రిజేంద్ర కుమార్ సల్మాన్‌ఖాన్‌కు ఐదు సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.25,000ల పరిహారాన్ని విధించిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్‌ఖాన్ కోర్టుకు హాజరుకాకపోవడం ఆయన రాక కోసం వేచి ఉన్న అభిమానులను నిరాశపరిచింది.
మరిన్ని
పాక్ గురుద్వారాను విడిచిపెట్టాలి: ప్రణబ్ ముఖర్జీ
'హనుమాన్' చిత్రంలో సీతదేవిగా శిల్పాశెట్టి
మీ భవితవ్యం.. మీ చేతుల్లోనే: కారత్
నటుడు సల్మాన్ శిక్ష అప్పీలుపై నేడు తుదితీర్పు
ఠాగోర్ మ్యూజియాన్ని దర్శంచిన జపాన్ ప్రధాని
మద్దతు ఉపసంహరించుకుంటాం: సీపీఎం హెచ్చరిక