ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయనున్న సల్మాన్
చింకారా వేట కేసులో ఐదేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసిన జోధ్‌పూర్ కోర్టు తీర్పుపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రాజస్థాన్ హైకోర్టులో రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. చింకారా జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ళ శిక్ష విధిస్తూ.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై జోధ్‌పూర్ జ్యుడిషియల్ కోర్టులో సల్మాన్ ఖాన్ అప్పీలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై విచారించిన కోర్టు సల్మాన్ పిటీషన్‌ను కొట్టివేసి, జైలుశిక్షను ఖరారు చేయడమే కాకుండా.. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది.

ఇదిలావుండగా శుక్రవారం కోర్టుకు హాజరుకాని సల్మాన్ ప్రస్తుతం ముంబైలోని బంద్రా నివాసంలో ఉన్నట్టు వినికిడి. ఆయన్ను అరెస్టు చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం ముంబైకు బయలుదేరింది. సల్మాన్‌ను నేడు లేదా రేపు అరెస్టు చేయవచ్చని భావిస్తున్నారు.

అలాగే.. రాజస్థాన్ హైకోర్టులో రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేయనున్నట్టు ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. దీన్ని దాఖలు చేస్తే.. తాత్కాలికంగా జైలుకు వెళ్లడం తప్పుతుంది. అయితే.. తొలుత కోర్టులో లొంగిపోయి, తర్వాత న్యాయ పోరాటం చేయాల్సిందిగా హైకోర్టు సూచించే అవకాశం ఉంది.
మరిన్ని
లెఫ్ట్ పార్టీల సందేహాలు నివృత్తి చేస్తాం: కపిల్ సిబాల్
కృష్ణ జింకల కేసు: లొంగిపోనున్న సల్మాన్
బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది: జ్యోతిబసు
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ పిటీషన్ కొట్టివేత
పాక్ గురుద్వారాను విడిచిపెట్టాలి: ప్రణబ్ ముఖర్జీ
'హనుమాన్' చిత్రంలో సీతదేవిగా శిల్పాశెట్టి