ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
పొరుగు దేశాల కుట్రవల్లే దేశంలో హింస: జైస్వాల్‌
భారత్ ఎదుగుదలను ఉపేక్షించలేని కొన్ని పొరుగు దేశాలు ఈర్ష్య, అసూయలతో దేశంలో హింసను ప్రజ్వలింపచేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీప్రకాశ్‌ జ్వైసాల్‌ ఆరోపించారు. దేశాన్ని అస్థిరపాలు చేయాలని పొరుగు దేశాలు చేస్తున్న కుట్రలను తాము సమర్థవంతంగా తిప్పికొడతామని మంత్రి ప్రకటించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో జైస్వాల్‌ ప్రసంగించారు.

వివిధ రంగాల్లో దేశం సాధిస్తున్న ప్రగతిని సహించలేని పొరుగు దేశాలు దేశంలో సృహృద్భావ వాతావరణాన్ని చెరిపి వేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. దీనికి నిదర్శనంగా గత శనివారం హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లని మంత్రి అన్నారు. గతంలో తీవ్రవాద దాడులు జరిగినప్పుడు దేశ ప్రజలంతా సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిన విషయాన్ని మంత్రి జైస్వాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మరిన్ని
ప్రశాంతంగా ముగిసిన అమరనాథ్‌ యాత్ర
ఒరిస్సాలో ప్రబలుతున్న కలరా: వంద మంది మృతి
మధ్యంతరం వల్ల లాభపడనున్న కాంగ్రెస్-బీఎస్పీలు
నేడు సీపీఐ జాతీయ కమిటీ అత్యవసర భేటీ
రేపు తేలనున్న బాలీవుడు నటుని భవితవ్యం
కేంద్ర మంత్రి లాలూకు ప్రధాని లేఖ