ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే: యూపీఏకు మెజారిటీ
భారత్-అమెరికా అణు ఒప్పందం కారణంగా కేంద్రంలో సంక్షోభం ఏర్పడి, మధ్యంతర ఎన్నికలు జరిగిన పక్షంలో యూపీఏ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంతో పోల్చితే ప్రస్తుతం యూపీఏ లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నట్టు, భారతయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, వామపక్షాలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నట్టు ఆ సర్వే ఫలితాలు వెల్లడించాయి.

23 రాష్ట్రాల్లో 18వేల ఓటర్ల వద్ద సర్వే నిర్వహించినట్టు సీఎన్‌ఎన్- ఐబీఎన్ సంస్థ పేర్కొంది. ఫలితాల్లో యూపీఏకు సొంతంగా 267 స్థానాలు రాగలదని తేలిందని వెల్లడించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ కూటమికి 222 స్థానాలు మాత్రమే వచ్చాయని గుర్తు చేసింది. అదేసమయంలో లెఫ్ట్ కూటమి బలం 55 నుంచి 43 స్థానాలకు, ఎన్డీయే బలం 189 నుంచి 133కు పడిపోగలదని కూడా వెల్లడించింది.
మరిన్ని
విదేశాలకు వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతి
ఒంటరి పోటీకే మొగ్గు: మమతా బెనర్జీ
లోయలో పడిన ట్రక్కు: 80 మంది దుర్మరణం
మెమన్ కుటుంబసభ్యులకు మధ్యంతర బెయిల్
కాన్పూర్ ఐఐటీని సందర్శించనున్న యూఎస్ రాయబారి
అణు ఒప్పందంతో భారత పరిశ్రమలకు లబ్ది: ప్రణబ్