అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది నీరు గ్రామాల్లోకి ప్రవేశించి ఇద్దరు మరణించారు. మరో 19మంది గల్లంతయ్యారు. లక్ష్మీపూర్ జిల్లాలోని గ్రామస్థులు గల్లంతయ్యారని అస్సాం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాన్పూర్ జిల్లాలో ఇద్దరు మరణించారని వారు వివరాలందించారు.
భారీ వర్షాల కారణంగా అస్సాంలోని ప్రజా జీవనం తీవ్రంగా స్తంభించింది. అస్సాంలోని జాతీయ రహదారుల్లో వరదనీరు ప్రవేశించడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. వర్షాల కారణంగా ఆరు మిలియన్ల ప్రజలు తమ నివాసాలను కోల్పోయారని అస్సాం ప్రభుత్వ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా 21 జిల్లాల్లో నీటిలో మునిగిపోయాయని వారు చెప్పారు. వరదబాధితులకు సహాయ చర్యలను అందించే దిశగా 600 శిబిరాలను అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆ వివరాలు వెల్లడించాయి. భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోతుందని అస్సాం ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలియజేశాయి.
|