తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బస్సుపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడిచేశారు. దీంతో.. బస్సుకు నిప్పు అంటుకుని ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి. బెంగుళూరు నుంచి చెన్నైకు బయలుదేరిన టీఎన్‌టీసీ బస్సు.. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన హోసూరు రోడ్డు, బైప్పన్‌హల్లి అనే ప్రాంతంలో రాత్రి 9.45 గంటల ప్రాతంలో వస్తున్నది.
ఆ సమయంలో కొందరుదుండగులు బస్సుపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీంతో బస్సుకు నిప్పు అంటుకుంది. బస్సులో వున్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కిందకు దూకేశారు. అయినప్పటికీ.. ఇద్దరు ప్రయాణికులు మాత్రం బస్సు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల వివరాలు వెల్లడికావాల్సి ఉంది. దీనిపై ఇరు రాష్ట్రాల పోలీసులు విచారణ జరుపుతున్నారు.
|