ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
నిషేధానికి గురైన లైవ్ ఇండియా న్యూస్ ఛానల్
నకిలీ స్టింగ్ కార్యకలాపాలకు పాల్పడిన లైవ్ ఇండియా న్యూస్ ఛానల్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. నిషేధాజ్ఞలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిషేధాజ్ఞలను అనుసరించి అక్టోబర్ 20వ తేదీ వరకు 'లైవ్ ఇండియా' (జన్మత్ టీవి కొత్తపేరు) దేశవ్యాప్తంగా తన ప్రసారాలను మరియు పునఃప్రసారాలను జరపకూడదు.

కేబుల్ టెలివిజన్ నియంత్రణ నెట్‌వర్క్ నియంత్రణ యాక్చు, 1995లోని సెక్షన్ 20కు చెందిన సబ్ సెక్షన్ 2(iv)ను అమలులోకి తెచ్చిన సమాచార మరియ ప్రసారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత యాక్టును అనుసరించి ప్రజాప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించే ఛానల్‌ను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది.

ఇదిలా ఉండగా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నారంటూ న్యూఢిల్లీ సర్వోదయ కన్యావిద్యాలయ టీచర్ ఉమా ఖురానాపై ప్రత్యేక స్టింగ్ కార్యకలాపాలను నిర్వహించిన లైవ్ ఇండియా అనంతరం వాటిని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసు విచారణలో స్టింగ్ కార్యక్రమం బూటకమని తేలడంతో లైవ్ ఇండియాపై కేంద్రప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది.
మరిన్ని
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడాకులు
నేటి నుంచి భాజాపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
రాముడు అబద్దాలకోరు:కరుణానిధి
ఐఏఈఏ ఛీఫ్‌ను కలిసిన కకోద్కర్
కొత్త చిక్కుల్లో సల్మాన్ ఖాన్
భారత్‌కు చేరుకున్న సునీతా విలియమ్స్