దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బుధవారం 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపరాష్ట్రపతి మహ్మద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
స్పీకర్ సోమనాథ్, ఉపరాష్ట్రపతి మహ్మద్ అన్సారీలు ఫోనులో శుభాకాంక్షలు తెలుపగా... సోనియా, ఇతర నేతలు పీంఎం అధికారిక నివాసానికి వెళ్లి అభినందించారు. గత వారం రోజలు క్రితం ఎయిమ్స్‌లో ఆపరేషన్ చేయికున్న ప్రధాని వైద్యుల సలహాతో ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రధాని అధికారిక ప్రతినిధి వెల్లడించారు.
|