ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
మధ్యంతరం దిశగా కర్ణాటక రాజకీయం
కర్ణాటకలోని జనతాళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ ఆదివారం నాడు గవర్నర్‌ను కలసి తన నిర్ణయం తెలుపనుంది.

భాజపా శాసనసభా పక్షనేత యడియూరప్ప నేతృత్వంలోని ఆ పార్టీ శాసనసభా పక్ష బృందం ఆదివారం గవర్నర్ రామేశ్వర్ ఠాకుర్‌ను కలిసి, తమ మద్దతు ఉపసంహరణ లేఖను అందజేస్తారు.

భాజాపా పార్లమెంటరీ బోర్డు శనివారం ఢిల్లీలో సమావేశమై ముఖ్యమంత్రి కుమార స్వామి నాయకత్వంలోని కర్ణాటక సర్కారుకు మద్ధతు ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు తప్పితే మరోమార్గం లేదని భాజపా అభిప్రాయపడింది. మరోవైపు ఎన్నికలకు తాము సిద్ధమని కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) పార్టీలు తెలిపాయి.

కాగా ఈ నెల 18వ తేదిన జరిగే బలపరీక్ష తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా భాజపాకు అధికార బదీలీ జరపకపోవటానికి కారణాలు ప్రజలకు తెలియజేస్తానని ముఖ్యమంత్రి కుమార స్వామి పేర్కొన్నారు.
మరిన్ని
మధ్యంతరంపై మౌనం వీడిన ప్రధాని
ఎన్నికలకు సిద్ధం: జేడీ (ఎస్) చీఫ్ దేవెగౌడ
జేడి (ఎస్) సర్కారుకు భాజపా మద్దతు ఉపసంహరణ
2009 ఎన్నికల్లో భాజపా-సేన పొత్తు: ఉద్ధవ్
బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 ప్రయోగం సక్సెస్
జేడీ (ఎస్)కు భాజపా మద్దతు ఉపసంహరణ నిర్ణయం