ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
సంజయ్‌దత్‌కు తీర్పు కాపీ
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ సోమవారం టాటా కోర్టు నుంచి 4,000 పేజీల తీర్పు కాపీని అందుకున్నారు. తీర్పు కాపీని అందుకున్న సంజయ్‌దత్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేసారు. అనంతరం సంజయ్‌దత్‌ను పోలీసులు ఆర్ధర్‌ రోడ్డు జైలుకు తరలించారు. అనంతరం ఆయనను ఎరవాడ జైలుకు తీసుకువెళ్లారు.

ఇదిలా ఉండగా టాడా కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు ఉపకరించే న్యాయపరమైన అంశాలను సంజయ్‌దత్ న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. ఆయుధాల చట్టం కింద టాడా కోర్టు సంజయ్‌దత్‌ను దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంజయ్‌దత్‌తో పాటు ఆయన సహచరులు కేర్సీ అడ్జానియా, యూసఫ్ నల్వల్లా మరియు రుస్సీ ముల్లాలు సోమవారం తీర్పు కాపీలను అందుకోన్నవారిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా శనివారంనాడు టాడా కోర్టుకు వచ్చిన సంజయ్‌దత్‌కు తీర్పు కాపీ లభించకపోవడంతో వెనుదిరిగిపోయారు.మెమన్ కుటుంబ సభ్యులు, మాజీ అదనపు కస్టమ్స్ కలెక్టర్ సోమనాథ్ థాపా, ఇంతియాజ్ గాథేతో పాటు కొందరు మహిళా దోషులకు మంగళవారం తీర్పు కాపీలను అందుకునే అవకాశం ఉంది.
మరిన్ని
ప్రారంభమైన యూపీఏ-లెఫ్ట్ "అణు"సమావేశం
తీర్పు కాపీని అందుకోనున్న సంజయ్‌దత్
ఘనంగా మైసూరు దసరా ఉత్సవాలు
దీపావళి తర్వాతే లెఫ్ట్ కమిటీ నివేదిక
నవంబర్ 08 లోగా "సేతు" నిర్మాణం పూర్తి
హిందూ ప్రతినిధులకే స్థానం: వీహెచ్‌పీ